ఉత్తరాఖండ్‌

ఉత్తరాఖండ్‌

ఉత్తరాఖండ్‌లోని పశ్చిమ హిమాలయ అడవుల్లో ఒక కొత్త సాలీడు జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ స్పైడర్‌ (సాలీ పురుగు) శరీరంపై నవ్వుతున్న మనిషి ముఖాన్ని పోలిన రంగురంగుల గుర్తులు ఉన్నాయి. అందుకే ఈ సాలీడుకు ‘హిమాలయన్‌ హ్యాపీ ఫేస్‌ స్పైడర్‌’(థెరిడియన్‌ హిమాలయానా) అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ సాలీడులో 32 రకాల రంగుల వేరియేషన్స్‌ (మార్పులు) గుర్తించారు. ఇది చూడటానికి హవాయి దీవుల్లో ఉండే హ్యాపీ ఫేస్‌ సాలీడులా ఉన్నప్పటికీ, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇది వేరే జాతికి చెందినదిగా తేలింది.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram