నాథూలా పాస్‌

నాథూలా పాస్‌

సిక్కింలోని నాథూలా పాస్‌ ద్వారా సాగే భారత్‌-చైనా బహిరంగ వాణిజ్యం ఆరేళ్ల విరామం అనంతరం 2026, ఆగస్టు 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా 2020లో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు. తర్వాత భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాని పునరుద్ధరణలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో ఈ వాణిజ్య మార్గం మళ్లీ తెరుచుకోబోతోంది.

  • పురాతన కాలం నుంచీ ప్రపంచ ప్రధాన వాణిజ్య మార్గంగా నిలిచిన సిల్క్‌ రూట్‌లో భాగమైన నాథూలా కనుమ (పాస్‌)ను 1962లో భారత్‌-చైనా యుద్ధం అనంతరం మూసివేశారు. 2006లో పునఃప్రారంభించారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram