భావనా కాంత్‌

భావనా కాంత్‌

భారత వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ భావనా కాంత్‌ మరోసారి అరుదైన ఘనత సాధించారు. ఐఏఎఫ్‌ అత్యంత కఠినమైన, ప్రతిష్ఠాత్మకమైన ఫైటర్‌ కంబాట్‌ లీడర్‌ (ఎఫ్‌సీఎల్‌) కోర్సును పూర్తిచేశారు. దేశంలోనే తొలి లేడీ ‘టాప్‌ గన్‌’గా నిలిచారు. గ్వాలియర్‌లోని టాక్టిక్స్‌ అండ్‌ ఎయిర్‌ కంబాట్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (టీఏసీడీఈ) నుంచి భావన ఈ అర్హత సాధించారు. దీన్ని అమెరికా నావికాదళానికి చెందిన ప్రసిద్ధ ‘టాప్‌ గన్‌’ కోర్సుతో పోలుస్తారు. అందుకే ఆ పేరు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram