దేశంలోనే తొలిసారిగా అధునాతన ఇమేజింగ్ సదుపాయాలతో రూపొందించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎండోస్కోపీ వ్యవస్థను దిల్లీలో ఎయిమ్స్ ఏర్పాటు చేసింది. దీంతో జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు మరింత ఆధునిక వైద్య సేవలు అందించే సామర్థ్యం ఆసుపత్రిలో పెరిగిందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. ఎయిమ్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి ఈపీ-6000 ఎండోస్కోపీ వ్యవస్థను ఫుజిఫిల్మ్ ఇండియా సంస్థ విరాళంగా అందించింది.