భారత అమ్ములపొదిలో మొత్తం 190 అణు వార్‌హెడ్లు ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య (ఎఫ్‌ఏఎస్) అంచనా వేసింది. నిర్మాణంలో ఉన్న కొత్త క్షిపణులకు అమర్చేందుకు సిద్ధం చేసిన 30 వార్‌హెడ్లు కూడా వీటిలో భాగమని తెలిపింది. ఈ సంస్థ తాజాగా వెల్లడించిన అంచనాల ప్రకారం.. భారత్ 140-225 అణు వార్‌హెడ్ల తయారీకి సరిపడా ప్లుటోనియాన్ని ఉత్పత్తి చేసింది.