భారత్‌లో కనిపించే భిన్న రకాల కోబ్రాల విషానికి విరుగుడుగా రీకాంబినెంట్ యాంటీవెనమ్‌ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), జర్మనీలోని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. స్పెక్టకల్డ్, మోనోకల్డ్ కోబ్రాలు, కింగ్ కోబ్రాల విషం నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది.
రీకాంబినెంట్ యాంటీవెనమ్ అనేది ల్యాబ్‌లో తయారవుతుంది. జంతువుల నుంచి సేకరించే యాంటీవెనమ్‌ల స్థానంలో ప్రవేశపెట్టేందుకు దీన్ని రూపొందించారు.