రుణావేశం (నెగెటివ్ ఛార్జ్) కలిగిన రెండు డీఎన్‌ఏ పోగులు పరస్పరం కలుసుకోవడాన్ని బ్రిటన్ పరిశోధకులు క్లిక్‌మనిపించారు. తద్వారా దాదాపు 20 ఏళ్లుగా అంతుచిక్కని అంశాన్ని వారు పరిష్కరించారు. హైపవర్డ్ అటామిక్ ఫోర్స్ మైక్రోస్కొపీ సాయంతో షెఫీల్డ్, యార్క్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
నిచ్చెన ఆకృతిలో ఉండే రెండు డీఎన్‌ఏ పోగులు (డబుల్ హెలిక్స్‌లు) పరస్పరం సంధానం కావడాన్ని చిత్రీకరించారు. ఈ ప్రాథమిక జీవ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే మొదటిసారి.