నింగిలోకి ప్రయోగించిన రాకెట్లను అలాగే వదిలేయకుండా వాటి శకలాలు ఎక్కడ పడ్డాయనేది గుర్తించి, సేకరించి మళ్లీ వినియోగించే ప్రక్రియను ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ ప్రారంభించింది. సేకరించిన శకలాల్ని రీసైకిల్ చేసేందుకు, ఆ భాగాలు తిరిగి ఎంతవరకు పనికొస్తాయని పరీక్షించేందుకు ఉపయోగపడే ‘దశలవారీ పరీక్ష, తనిఖీ కేంద్రాన్ని(స్టిఫ్)’.. రాకెట్ నడిచేందుకు ఉపయోగపడే హైప్రెషర్ ఇంధన ట్యాంకుల్ని తయారుచేసేందుకు ‘ప్రెషెరెంట్ ట్యాంక్ తయారీ, ఓవర్‌ర్యాపింగ్, అనుబంధ పరికరాల అమరిక కేంద్రాన్ని(ప్రూఫ్)’ తాజాగా అందుబాటులోకి తెచ్చింది.