బ్లూ మెషీన్స్‌ ఏఐ మోడల్‌ ‘అరోరా’

బ్లూ మెషీన్స్‌ ఏఐ మోడల్‌ ‘అరోరా’

బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన బహుభాషా స్పీచ్‌-టూ-టెక్స్ట్‌ మోడల్‌ ‘అరోరా’ను అంకుర సంస్థ బ్లూ మెషీన్స్‌ ఏఐ 2026, సెప్టెంబరు 7న విడుదల చేసింది. 2026 ప్రారంభంలో టెలివిజన్‌ వేదికగా అన్‌స్క్రిప్టెడ్‌గా గంటపాటు జరిగిన ప్రత్యక్ష ‘ఏఐ వర్సెస్‌ హ్యూమన్‌’ డిబేట్‌తో ఈ స్టార్టప్‌ విస్తృత గుర్తింపు పొందింది. మన దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంభాషణలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ కస్టమర్లు మాట్లాడేటప్పుడు తరచూ ఒక భాష నుంచి మరో భాషలోకి మారడం, ప్రాంతీయ భాషలతో ఆంగ్ల ఆర్థిక పదాలను కలపడం, తక్కువ బ్యాండ్‌విడ్త్‌ లేదా నేపథ్య శబ్దాలు ఎక్కువగా ఉండే టెలిఫోన్‌ కనెక్షన్‌ల్లో మాట్లాడటం సాధారణమని బ్లూమెషీన్స్‌ తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram