టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌

టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌

అంతర్జాతీయ రక్షణ రంగంలో టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (టీబీఏఎల్‌) మరో ఘనత సాధించింది. హైదరాబాద్‌లోని తమ అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి ఏహెచ్‌-64ఈ అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ కోసం 400వ ఫ్యూజ్‌లేజ్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్, బోయింగ్‌ సంయుక్తంగా టీబీఏఎల్‌ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌లో 52,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అత్యాధునిక ప్లాంట్‌లో 750 మందికి పైగా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అధునాతన రోబోటిక్స్, ఆటోమేషన్‌ సాంకేతికతలతో ఇక్కడ అపాచీ ఫ్యూజ్‌లేజ్‌ ఏరోస్ట్రక్చర్‌లను తయారు చేస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram