డీఆర్‌డీఓ

డీఆర్‌డీఓ

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సొంతంగా అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ప్రైవేటు రంగానికి బదిలీ కానుంది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, సాంకేతికత బదలాయింపునకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2026, ఆగస్టు 25న ఆమోదముద్ర వేశారు. మిసైళ్లను అభివృద్ధి దశ నుంచి వేగంగా ఉత్పత్తి దశకు తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • సాంకేతికత బదిలీని అందుకునే హక్కు పొందేందుకు భారతీయ ప్రైవేటు కంపెనీల మధ్య పోటీ బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. అందులో విజయవంతంగా నిలిచిన సంస్థలు, డీఆర్‌డీఓకు అభివృద్ధి-తయారీ భాగస్వామిగా మారతాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram