అస్సాంకు చెందిన ప్రసిద్ధ స్వదేశీ ‘లఖిమి’ జాతి పెయ్యి దూడ ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫలదీకరణ) పద్ధతిద్వారా జన్మించింది. అస్సాంలో పశు సంపద సంరక్షణ, పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్న అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ ఈ ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘రాష్ట్రీయ గోకుల మిషన్’ ఆర్థిక సహాయంతో యూనివర్సిటీ ప్రయోగశాలలో దీనికి సంబంధించిన ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.