కణం వయసును అంచనా వేసే పరికరం

కణం వయసును అంచనా వేసే పరికరం

ఒక కణంలోని జన్యువుల క్రియాశీలతను విశ్లేషించడం ద్వారా దాని జీవసంబంధ వయసును అంచనా వేయగల పరికరాన్ని స్వీడన్‌కు చెందిన కరోలిన్‌ స్కా ఇన్‌స్టిట్యూట్, స్టాక్‌హోమ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు. కణంలో ఏ జన్యువులు చురుగ్గా ఉన్నాయి, ఏవి నిశ్చలంగా ఉన్నాయో పాస్టా అనే ఈ పరికరం నిర్ధారించగలదు. ఇది కణాల వృద్ధాప్యాన్ని ప్రభావితం చేసే పదార్ధాలను గుర్తించడంతోపాటు వయసు మళ్లిన, బలహీన కణాలను, స్టెమ్‌ సెల్‌ లాంటి కణాలను వేరు చేసి చూపగలదు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram