తక్కువ లోతు గల సముద్ర తీర జలాల్లో శత్రు జలాంతర్గాములను వేటాడగల మంగ్రోల్ అనే ఒక నౌకను కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించి, 2026, ఆగస్టు 21న భారత నౌకాదళానికి అందజేసింది. యాంటీ-సబ్ మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని పిలిచే ఈ నౌక నీటిఅడుగున నిఘా, శోధనతోపాటు సహాయ కార్యక్రమాలను కూడా నిర్వహించగలదు. కొచ్చిన్ షిప్ యార్డ్ ఇలాంటి ఎనిమిది జలాంతర్గాములను నిర్మిస్తోంది. వాటిలో మూడోది ఈ మంగ్రోల్.