కీమోథెరపీ స్థానంలో స్మార్ట్ క్యాన్సర్ ఔషధం ఆర్‌కే-251 అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేవలం క్యాన్సర్ కణాలే లక్ష్యంగా పని చేస్తుందని, ఇది అందుబాటులోకి వస్తే కీమోథెరపీ అవసరం ఉండదని పేర్కొంది. కీమోవల్ల ఆరోగ్యకర కణాలకు హాని కలిగే అవకాశముంటుందని, కొత్త విధానంవల్ల ఆ పరిస్థితి తలెత్తదని వివరించింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి (ఐఏఎస్‌ఎస్‌టీ) చెందిన ఆసిస్ బలా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ టెక్నాలజీ-గువాహటికి చెందిన కేపీ భాబక్ కలిసి ఈ ఔషధాన్ని రూపొందించారు.