విశ్వంలో 10వేల కోట్ల సూర్యుళ్ల స్థాయిలో వెలుగులీనుతోన్న ఒక భారీ ఆకృతిని అమెరికా శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. సౌర కుటుంబం కంటే ఇది పెద్దగా ఉంది. రోదసిలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) దీన్ని గుర్తించింది. దాన్ని కొత్తరకం ఖగోళ వస్తువుగా వర్గీకరించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. హైదరాబాద్‌లో జన్మించిన రోహన్ నాయుడు వీరికి నేతృత్వం వహించారు.