మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ శీతల ఉష్ణోగ్రతలనూ తట్టుకోగల ప్రత్యేక డీజిల్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ 2026, జులై 31న ఆవిష్కరించారు. ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ (ఎక్స్‌డబ్ల్యూజీ) డీజిల్‌గా దీనికి నామకరణం చేశారు. దీనివల్ల అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో సైనిక రవాణా, పోరాట సన్నద్ధత మెరుగుపడతాయని తెలిపారు. బీఎస్-6 ప్రమాణాలు, ఐఎస్ 1460:2025 నిర్దేశాలకు అనుగుణంగా ఇది రూపొందింది. ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే సైన్యం వద్ద ప్రస్తుతం ఉన్న వాహనాల్లో దీన్ని వాడొచ్చు.