కృత్రిమ సూర్యుడి సృష్టికి అవసరమైన భారీ సూపర్‌కండక్టింగ్ ఫ్యుజన్ మ్యాగ్నెట్‌ను చైనా నిర్మించి, విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అయస్కాంతం ఇదే. దీని బరువు 582 టన్నులు. పొడవు 21 మీటర్లు. వెడల్పు 12 మీటర్లు. ఆంగ్ల వర్ణమాలలోని ‘డి’ ఆకారంలో ఉండే ఈ భారీ అయస్కాంతాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసింది. ఆ దేశం అపరిమిత విద్యుదుత్పత్తి కోసం కృత్రిమ సూర్యుణ్ని అభివృద్ధి చేయాలన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.