‘ఐజీకార్‌’లో హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రం

‘ఐజీకార్‌’లో హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రం
  • తమిళనాడులోని కల్పాక్కంలో ఉన్న ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీకార్‌)లో.. ప్రపంచంలోనే తొలిసారిగా అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అణుశక్తి విభాగం కార్యదర్శి అజిత్‌కుమార్‌ మొహంతీ 2026, జూన్‌ 26న దీన్ని ప్రారంభించారు. 
  • ముంబయిలోని భాభా అణు పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన కాపర్‌ క్లోరిన్‌ థర్మోకెమికల్‌ ప్రక్రియ ద్వారా అణుశక్తి వినియోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తిచేసే విధంగా ఐజీకార్‌లో ఏర్పాట్లు చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram