సరికొత్త ప్రపంచ పటం

సరికొత్త ప్రపంచ పటం
  • వివిధ దేశాలు, ఖండాల వైశాల్యాన్ని కచ్చితంగా చూపే సరికొత్త ‘ఈక్వల్‌ ఏరియా మ్యాప్‌’ను (నిజ వైశాల్య ప్రపంచ పటం) ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. దీంతో 16వ శతాబ్దం నుంచి అమల్లో ఉన్న మర్కేట ప్రపంచ పటం కనుమరుగు కానుంది. కొత్త పటంలో భారత్‌ ఆఫ్రికాలు ప్రస్తుతాని కంటే పెద్దగా కనిపిస్తాయి. అమెరికా కొంత చిన్నదిగా కనిపించనుంది.

  • పటంలో మాత్రమే ఈ మార్పులు కనిపిస్తాయి. దేశాల వాస్తవ సరిహద్దుల్లో ఎటువంటి మార్పులు ఉండవు. సర్వప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో సరికొత్త ప్రపంచ పటానికి అనుకూలంగా భారత్‌ ఓటేసింది. కరెక్ట్‌ ద మ్యాప్‌ (పటాన్ని సరిచేయండి) అనే నినాదంతో టోగో దేశం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 193 మంది సభ్యులు కలిగిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభలో 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన ఏకైక దేశం అమెరికా.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram