ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియా తీరానికి సమీపంలో 2026, ఆగస్టు 15న భారీ భూకంపం సంభవించింది. 47 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. పలు భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ 7.7గా నమోదైంది. తొలి ప్రకంపనం తర్వాత 235 చిన్న కంపనలూ వచ్చాయని ఇండోనేసియా వాతావరణ, భూభౌతిక సంస్థలు వెల్లడించాయి. వీటి భూకంప కేంద్రం ఈస్ట్‌ నుసా టెంగారా ప్రావిన్స్‌కు చెందిన ఎండె నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో, సముద్రం అడుగున 10 కిలోమీటర్ల భూమిలోపల ఉన్నట్లు అమెరికా జియలాజికల్‌ సర్వే సంస్థ పేర్కొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram