కొలంబియాలో భూకంపం

కొలంబియాలో భూకంపం

కొలంబియాలో 2026, ఆగస్టు 10న రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం నమోదైంది. ఈ విపత్తులో 111 మంది మరణించారు. పలు భవనాలు కూలిపోయాయి. భవన శిథిలాల కింద వందలమంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మరెంతో మంది గాయపడ్డారు. దేశ రాజధాని బొగోటాకు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్‌ జోస్‌ డెల్‌ పామార్‌ వద్ద ఈ భూకంప కేంద్ర స్థానం ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం జనించిందని అమెరికా జియలాజికల్‌ సర్వే సంస్థ వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram