బొలీవియాలో ఎమర్జెన్సీ

బొలీవియాలో ఎమర్జెన్సీ

బొలీవియాలో అత్యయిక స్థితిని (ఎమర్జెన్సీ) విధిస్తూ అధ్యక్షుడ[ు రోడ్రిగో పాజ్‌ 2026, జూన్‌ 20న నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంధన, ఆహార సరఫరాల దిగ్బంధనాన్ని తొలగించే అధికారాలు సైన్యం చేతుల్లోకి వెళ్లాయి. దేశంలో ఇంధన సబ్సిడీల రద్దు వంటి పొదుపు చర్యలు చేపట్టిన అధ్యక్షుడు పాజ్‌ దిగిపోవాలని కోరుతూ ప్రజలు గత అయిదు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కొన్ని చోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ విధిస్తూ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram