వరిలో 24 శాతం లోటు

వరిలో 24 శాతం లోటు

తెలంగాణలో వానాకాలం సీజన్‌ పంటల సాగు ముగింపు దశకు చేరుతోంది. మొత్తం 1,32,38,446 ఎకరాలకు గాను 2026, ఆగస్టు 25 వరకు 1,18,63,969 (89.62%) ఎకరాల్లో పంటలు వేశారు. ప్రధాన పంట వరి 65,95,645 ఎకరాలకు గాను 50,11,417 సాగయింది. నెలాఖరు వరకు వరినాట్లకు అవకాశం ఉండగా.. ఇప్పటికి 24.02% మేర తక్కువగా సాగయింది. సీజన్‌లో ఇప్పటివరకు 28.68 శాతం వర్షపాతం లోటు ఉంది. 15 జిల్లాలు, 266 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. పంటల సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. సీజన్‌లో మొత్తం పంటల విస్తీర్ణంలో 10.38% లోటు ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram