డయల్‌ 112

డయల్‌ 112

దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమమేధ(ఏఐ) ఆధారిత జనరేషన్‌ డయల్‌ 112 సేవలను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తెలంగాణ పోలీసు శాఖ నెక్స్ట్‌ జనరేషన్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (టీజీ- ఈఆర్‌ఎస్‌ఎస్‌) డయల్‌ 112ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల రక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ సేవలన్నీ ఒకే జాతీయ నంబరు కిందకు తీసుకొచ్చారు. ఈ అత్యవసర సేవల విభాగాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ 2026, ఆగస్టు 5న ప్రారంభించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram