‘గివింగ్‌ వింగ్స్‌ టూ ఫ్లై కార్యక్రమం’

‘గివింగ్‌ వింగ్స్‌ టూ ఫ్లై కార్యక్రమం’

తెలంగాణలో ఇంటర్‌ పూర్తయిన అమ్మాయిలకు పైలట్‌ శిక్షణనిచ్చేందుకు ఇండిగో సంస్థ సీఎస్‌ఆర్‌ విభాగం ఇండిగోరీచ్, ఇంటర్‌ విద్యాశాఖ 2026, ఆగస్టు 4న ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఇండిగోరీచ్, భారత్‌ కేర్‌ సంస్థలతో కలిసి అమలుచేస్తున్న ‘గివింగ్‌ వింగ్స్‌ టూ ఫ్లై కార్యక్రమం’ ద్వారా పైలట్‌ శిక్షణనిస్తారు. సుమారు 20 నెలల శిక్షణా కాలంలో కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌(సీపీఎల్‌), ట్రైనింగ్‌ విత్‌ ఏటీఆర్‌ టైప్‌ రేటింగ్, బస, భోజన వసతి, వైద్య బీమా, మెంటార్‌షిప్, కెరీర్‌ మార్గదర్శక ఖర్చులను ఆయా సంస్థలే భరిస్తాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram