పీఎంసేతులో రాష్ట్రానికి నాలుగు హబ్‌లు

పీఎంసేతులో రాష్ట్రానికి నాలుగు హబ్‌లు

యువతకు పారిశ్రామిక అవసరాల మేరకు నైపుణ్యాలు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించేందుకు వీలుగా ఐటీఐలను ఆధునికీకరించేందుకు కేంద్రం ప్రారంభించిన పీఎంసేతు పథకంలో తెలంగాణ నుంచి నాలుగు హబ్‌లు ఎంపికయ్యాయి. ఒక్కోహబ్‌లో అయిదు ఐటీఐలుంటాయి. వీటిలో ఒకటి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఈ ఐటీఐల ఉన్నతీకరణకు నిధులు మంజూరు చేయడంతో పాటు పారిశ్రామిక సంస్థలను భాగస్వామ్యం చేస్తారు. తెలంగాణ నుంచి అత్యధికంగా నాలుగు హబ్‌లు పటాన్‌చెరు, సంగారెడ్డి, హైదరాబాద్‌ పాతబస్తీ, మేడ్చల్‌ అనుమతి పొందగా...మరో రెండు పరిశీలనలో ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram