తెలంగాణపై రుణ భారం

తెలంగాణపై రుణ భారం
  • తెలంగాణపై ఉన్న మొత్తం రుణ భారం 2024-25 నాటికి రూ.6,89,021 కోట్లని కాగ్‌ తేల్చింది. ప్రభుత్వేతర రుణాలకు అత్యధిక గ్యారంటీలు ఇచ్చిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పింది. అత్యధిక అప్పుల భారం పెరిగిన రాష్ట్రాల్లోనూ తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2015-16 నుంచి 2024-25 మధ్య పదేళ్లకాల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి కాగ్‌ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 
  • పదేళ్లలో అన్ని రాష్ట్రాల పబ్లిక్‌ అకౌంట్‌ బకాయిలు (రాష్ట్ర ప్రావిడెంట్‌ ఫండ్స్‌కు వచ్చే సొమ్ము, చిన్నమొత్తాల పొదుపు వసూళ్ల వంటివి) సగటున 106% పెరగ్గా తెలంగాణ లయబిలిటీ మాత్రం 826% పెరిగింది. ఇది దేశంలో అత్యధికం. 
  • అన్ని రాష్ట్రాల ఉమ్మడి అప్పులు 190% పెరగ్గా, తెలంగాణ అప్పులు 357% పెరిగాయి. ఇది దేశంలో అత్యధికం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram