మనూలో పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌

మనూలో పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2026-27 విద్యా సంవత్సరానకి డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సెంటర్ (CDOE), జులై సెషన్ కోసం ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) కింద వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

వివరాలు:

రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు: ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లిష్, హిస్టరీ, అరబిక్, హిందీలలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A.).

  • 4-ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (4YUG) కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (Hons), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (Hons), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (Hons).

  • ఏడాది డిప్లొమా & సర్టిఫికేట్ కోర్సులు: టీచ్ ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, అర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, స్కూల్ లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఉర్దూ, గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌లలో డిప్లొమా కోర్సులు; అలాగే ఫంక్షనల్ ఇంగ్లిష్, ప్రోఫిషియెన్సీ ఇన్ ఉర్దూ త్రూ ఇంగ్లిష్‌లలో సర్టిఫికేట్ కోర్సులు.

మనూ క్యాంపస్: హైదరాబాద్, న్యూదిల్లీ, కోల్‌కతా, ముంబయి, పట్నా, అమరావతి, లఖ్‌నవూ, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, బెంగళూరు, నూహ్‌, వారణాసి.

అర్హత:

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఉర్దూ భాషా ప్రావీణ్యం కలిగి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల అర్హతలు ఎంచుకున్న విభాగాన్ని బట్టి 10వ తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు ఉంటాయి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు చివరి తేదీ: 10 సెప్టెంబర్, 2026

అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 14 సెప్టెంబర్, 2026 (సాయంత్రం 06:00 గంటల వరకు)

Website: https://manuuadmission.samarth.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram