తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026

తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉస్మానియా యూనివర్సిటీ టీజీ సెట్‌ (TG SET 2026)ను నిర్వహిస్తోంది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు:

  • తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026

సబ్జెక్టులు: జాగ్రఫీ, కెమికల్‌ సైన్సెస్‌, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్‌, ఎడ్యుకేషన్‌, ఇంగ్లిష్‌, ఎర్త్‌సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యునికేషన్స్‌, మేనేజ్‌మెంట్‌, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, సంస్కృతం, సోషల్‌ వర్క్‌, ఎన్పిరాన్మెంటల్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌.

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ లేదా సమానమైన పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, తదితర రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. ప్రస్తుతం మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న వారు లేదా ఫైనల్ ఇయర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు www.telanganaset.org వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒక్క అభ్యర్థి ఒక్క అప్లికేషన్ మాత్రమే సమర్పించాలి. ఫొటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్ల స్కాన్ కాపీలను సిద్ధంగా ఉంచి, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి, యూపీఐ/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి.

వయోపరిమితి: టీజీ సెట్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2,000; బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1,500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.1.000.

పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 3 గంటల వ్యవధిలో ఒకే సెషన్‌లో పరీక్ష జరుగుతుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.
పేపర్‌-I: 50 ప్రశ్నలు 100 మార్కులు, పేపర్‌-II: 100 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్‌ కేటగిరీకి రెండు పేపర్లలో కలిపి కనీసం 40%, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 35% మార్కులు అవసరం.

పరీక్ష కేంద్రాలు: పరీక్షను ఈ 9 ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తారు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి.

ముఖ్యమైన తేదీలు:

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు: 30-08-2026

రూ.1,500 + రిజిస్ట్రేషన్ ఫీజుతో: 31-08-2026 నుంచి 05-09-2026

రూ.2,000 + రిజిస్ట్రేషన్ ఫీజుతో: 06-09-2026 నుంచి 10-09-2026

రూ.3,000 + రిజిస్ట్రేషన్ ఫీజుతో: 11-09-2026 నుంచి 12-09-2026

ఎడిట్ ఆప్షన్: 13-09-2026 నుంచి 15-09-2026

హాల్ టికెట్లు: 24-09-2026 నుంచి

పరీక్ష తేదీలు: 28-09-2026 నుంచి 30-09-2026

Website: https://telanganaset.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram