డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు

డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు

డాక్టర్ వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి హార్టిసెట్‌ (HORTICET-2026) ద్వారా డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు 4 సంవత్సరాల బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌- 4 సంవత్సరాల డిగ్రీ (డిప్లొమా హార్టికల్చర్‌ అభ్యర్థులకు లేటరల్ అడ్మిషన్)

మొత్తం సీట్ల సంఖ్య: 91

  • జనరల్ కోటా - 81

  • పేమెంట్ కోటా- 2

  • ఈడబ్ల్యూఎస్‌ కోటా - 8

విశ్వవిద్యాలయ కళాశాలలు: 61 సీట్లు; అఫిలియేటెడ్ కళాశాలలు: 30 సీట్లు

అర్హత: డాక్టర్ వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కౌన్సెలింగ్ సమయంలో ఫైనల్ మార్క్స్ మెమో, పాస్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. ప్రవేశాలు హార్టిసెట్‌-2026 ర్యాంక్ ఆధారంగా కల్పిస్తారు.

వయోపరిమితి: 2026 డిసెంబర్ 31 నాటికి జనరల్/బీసీ: 17 నుంచి 22 సంవత్సరాలు; ఎస్సీ/ఎస్టీలకు గరిష్టంగా 25 సంవత్సరాలు, దివ్యాంగులకు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: నిర్దేశించిన దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి, అవసరమైన ధ్రువపత్రాలు, ఫీజు రసీదుతో కలిసి రిజిస్ట్రార్, డా.వై.ఎస్.ఆర్‌ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెంకటరామన్నగూడెం చిరునామాకు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపాలి. ఫీజు ఆన్‌లైన్ ద్వారా లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించవచ్చు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.500, ఇతరులకు రూ.1000.

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 26.08.2026.

తాత్కాలిక పరీక్ష తేదీ: 10.09.2026 ఉదయం 10:30 నుంచి 12:30 వరకు.

పరీక్షా కేంద్రాలు

కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, వెంకటరామన్నగూడెం, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి.

కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, అనంతరాజుపేట, రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా.

పరీక్ష వ్యవధి 2 గంటలు, మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.

Website: https://drysrhu.ap.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram