ఎస్‌పీఎంవీవీలో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సులు

ఎస్‌పీఎంవీవీలో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సులు

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పీఎంవీవీ) 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

1. పాలియేటివ్‌ కేర్‌ (సర్టిఫికెట్‌ కోర్స్‌): 15 నుంచి 25 సీట్లు

అర్హత: టెన్త్‌ ఉత్తీర్ణత లేదా టెన్త్‌ ఫెయిల్‌.

కోర్సు వ్యవధి: 3 నెలలు

2. పీజీ డిప్లొమా ఇన్‌ డేటా సైన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌: 60 సీట్లు

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)

కోర్సు వ్యవధి: ఏడాది.

3. డిప్లొమా ఇన్‌ యోగా

అర్హత: ఇంటర్మీడియట్‌

కోర్సు వ్యవధి: ఏడాది.

4. పీజీ డిప్లొమా ఇన్‌ యోగా

అర్హత: ఏదైనా డిగ్రీ.

కోర్సు వ్యవధి: ఏడాది.

దరఖాస్తు ఫీజు: పీజీ డిప్లొమా డేటా సైన్స్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సుకు రూ.500; ఇతర కోర్సులకు రూ.150 డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా చెల్లించాలి.

దరఖాస్తు విధానం: పూర్తి చేసిన ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ జత చేసి చివరి తేదీలోగా డైరెక్టర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 15.07.2026.

Website:https://www.spmvv.ac.in/faculty-recruitments/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram