ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ అండ్‌ హాస్పిటల్, బిహ్తా, పట్నా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషలిస్ట్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • సీనియర్ రెసిడెంట్ - 41

విభాగాలు: అనస్థీషియాలజీ, పాథాలజీ, చెస్ట్, ఈఎన్‌టీ, ఐ, జనరల్ మెడిసిన్, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, ఎఫ్‌ఎంటీ తదితర విభాగాలు. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ & మెటబాలిజం, హెమటాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ తదితర విభాగాలు ఉన్నాయి.

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థికి చెల్లుబాటయ్యే ఎన్‌ఎంసీ/స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.67,700 ఫిక్స్‌డ్ బేసిక్ పే, ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూలో అభ్యర్థి విద్యార్హతలు, పనితీరు ఆధారంగా సెలక్షన్ బోర్డు ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఐసీ రెగ్యులర్ ఉద్యోగులు/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతర కేటగిరీలకు రూ.500. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 2026 సెప్టెంబరు 8, 9, 10.

వేదిక: కాలేజ్ కౌన్సిల్ రూమ్, కాలేజ్ బిల్డింగ్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్, బిహ్తా, పట్నా - 801103.

Website: https://www.mcpatna.esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram