ఈఎస్‌ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఈఎస్‌ఐసీ సనత్‌నగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ స్పెషాలిటీలలో ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 67

వివరాలు:

  1. ప్రొఫెసర్

  2. అసోసియేట్ ప్రొఫెసర్

  3. అసిస్టెంట్ ప్రొఫెసర్

  4. సీనియర్ రెసిడెంట్

విభాగాలు: బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అనాటమీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, రుమటాలజీ, టీబీ చెస్ట్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, ఐసీయూ, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, ఓబీజీవై, రేడియాలజీ, పాథాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, కార్డియాలజీ, హెమటాలజీ, తదితర విభాగాలు..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 నుంచి 69 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,59,515. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,72,572. అసిస్టెంట్ ప్రొఫెసర్ & సీనియర్ రెసిడెంట్ కు రూ.1,48,263.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 2026 ఆగస్టు 24, 25, 26, 27, 31.

వేదిక: అకాడమిక్ బ్లాక్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సనాత్‌నగర్, హైదరాబాద్.

Website: https://esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram