రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్‌షిప్‌

రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్‌షిప్‌

ప్రముఖ ప్రైవేటు పారిశ్రామిక సంస్థ- రిలయన్స్ ఫౌండేషన్‌ ఏటా పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలను అందిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 5 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందించనున్నారు.

వివరాలు:

  • రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్‌షిప్‌ 2026-27

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్‌ ఉత్తీర్ణత 2026-27 విద్యా సంవత్సరం ఏదైనా స్ట్రీమ్‌లో రెగ్యులర్ ఫుల్-టైమ్ డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షలకు మించకూడదు.

అందే స్కాలర్‌షిప్: ఎంపికైన డిగ్రీ చదువుకునే విద్యార్థులకు మొత్తం రూ.2 లక్షల ఉపకారవేతనాన్ని అందిస్తారు.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గతంలో విద్యార్థులు చూపిన అకడమిక్ ప్రతిభ, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 5 చివరితేదీ.

ముఖ్యాంశాలు:

  • రిలయన్స్ ఫౌండేషన్‌ యూపీ స్కాలర్‌షిప్ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

  • డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

Website: https://www.scholarships.reliancefoundation.org/UG_Scholarship#eligibility-criteria

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram