ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (EWS- ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) కి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను, వృత్తి విద్యా కోర్సులను అభ్యసించడానికి ఆర్థిక సాయం అందించేందుకు ఎల్.ఐ.సి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ (LIC GJF) "గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2026" నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్ నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తోంది. ఏటా రూ.20,000 నుంచి 50,000 స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.
వివరాలు:
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2026
అర్హతలు:
జనరల్ స్కాలర్‌షిప్: 2023-24, 2024-25, 2025-26 విద్యాసంవత్సరాల్లో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. 2026-27 విద్యాసంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4,50,000కు మించకూడదు. 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది.
స్పెషల్ స్కాలర్‌షిప్: 2023-24, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో టెన్త్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 2026-27లో ఇంటర్, ఒకేషనల్ లేదా డిప్లొమా, ఐటీఐ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. పదోతరగతి విద్యార్థుల పై చదువులకు ఉపకార వేతనం అందుతుంది.
స్కాలర్‌షిప్ వివరాలు: మెడిసిన్ కోర్సులకు ఏడాదికి రూ.50,000, ఇంజినీరింగ్‌కు రూ.40,000, సాధారణ డిగ్రీ, ఒకేషనల్, డిప్లొమా/ఐటీఐ కి రూ.20,000, పదవ తరగతి తర్వాతి స్పెషల్ స్కాలర్‌షిప్‌కు రూ.15,000 చొప్పున సంవత్సరానికి రెండు విడతల్లో (NEFT ద్వారా) చెల్లిస్తారు.
పార్ట్-టైమ్, కరస్పాండెన్స్, ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు, సీఏ, సీఎస్, ఐసీఎంఏఐ వంటి సెల్ఫ్-స్టడీ కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు. అయితే రెండవ దరఖాస్తుదారు మహిళా విద్యార్థి అయితే ఇద్దరికి అవకాశం ఉంటుంది.
ఎంపిక: ప్రతి డివిజన్ ఆఫీస్ పరిధిలో 120 మంది చొప్పున విద్యార్థులను (80 జనరల్ + 40 స్పెషల్) మెరిట్, ఆదాయ ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ https://licindia.in లోని లింక్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేయాలి. మీ పిన్ కోడ్ ఆధారంగా దరఖాస్తు ఆటోమేటిక్‌గా సంబంధిత ఎల్‌ఐసీ డివిజన్‌కు పంపబడుతుంది. అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ ద్వారా రసీదు (Acknowledgement) అందుతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2026.
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం