సాంస్కృతిక రంగాల్లో యువ కళాకారులకు స్కాలర్‌షిప్‌లు 

సాంస్కృతిక రంగాల్లో యువ కళాకారులకు స్కాలర్‌షిప్‌లు 

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఆఫ్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ స్కాలర్‌షిప్‌ టు యంగ్‌ ఆర్టిస్ట్స్‌ ఇన్‌ డిఫరెన్స్‌ ఫీల్డ్స్‌ (ఎస్‌వైఏ)- 2026-27 పథకాన్ని అమలు చేస్తోంది. భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యం, థియేటర్‌, దృశ్య కళలు, జానపద, సంప్రదాయ కళలు తదితర రంగాల్లో ప్రతిభ ఉన్న యువ కళాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ పొందేందుకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు.  

వివరాలు:

సాంస్కృతిక రంగాల్లో యువ కళాకారులకు ఆర్థిక సహాయం (Scholarships to Young Artistes in Different Cultural Fields (SYA)-2026-27)- 400 స్కాలర్‌షిప్‌లు

స్కాలర్‌షిప్‌: ఎంపికైన కళాకారులకు నెలకు రూ.5,000.

జీవన ఖర్చులు, ప్రయాణం, పుస్తకాలు, కళా సామగ్రి, శిక్షణ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

స్కాలర్‌షిప్ కాలవ్యవధి: 2 సంవత్సరాలు

అర్హత ఉన్న కళా విభాగాలు:

1. భారతీయ శాస్త్రీయ సంగీతం

హిందుస్థానీ క్లాసికల్ సంగీతం (గాత్ర, వాయిద్య)

కర్ణాటక సంగీతం (గాత్ర, వాయిద్య)

2. భారతీయ శాస్త్రీయ నృత్యం

భరతనాట్యం, కథక్, కూచిపూడి, కథకళి, ఒడిస్సీ, మణిపురి, సత్రియా తదితర నృత్యాలు.

3. థియేటర్‌: నటన, దర్శకత్వం, ఇతర థియేటర్‌ కళలు
(ప్లే రైటింగ్‌, పరిశోధనలకు వర్తించదు).

4. దృశ్య కళలు: పెయింటింగ్, శిల్పకళ, గ్రాఫిక్స్, క్రియేటివ్ ఫోటోగ్రఫీ, మట్టి కళలు తదితరాలు.

5. జానపద, సంప్రదాయ, గిరిజన కళలు: బొమ్మలాట, జానపద, నాటకాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం.

6. లైట్ క్లాసికల్ సంగీతం: తుమ్రీ, దాద్రా, గజల్, కవ్వాలి తదితరాలు.

అర్హతలు:

అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి.

ఎంపిక చేసిన కళారంగంలో ఇప్పటికే ప్రాథమిక నైపుణ్యం కలిగి ఉండాలి.

ప్రారంభ స్థాయి కళాకారులు అర్హులు కాదు.

గుర్తింపు పొందిన గురువు/సంస్థ వద్ద కనీసం 5 సంవత్సరాల శిక్షణ పొందాలి.

కళపై సైద్ధాంతిక, ప్రాక్టికల్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: 2026-27 బ్యాచ్‌కు దరఖాస్తు చేసుకునేవారు 01-04-2001 నుంచి 31-03-2008 మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ/పర్ఫార్మెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.

నిపుణుల కమిటీ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తుంది.

తుది ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది

అవసరమైన పత్రాలు:

విద్యార్హతల ధ్రువపత్రాలు

వయస్సు రుజువు (10వ తరగతి సర్టిఫికెట్/జనన ధ్రువపత్రం/ఆధార్ తదితరాలు)

పాస్‌పోర్ట్ సైజు ఫోటో

5 సంవత్సరాల శిక్షణ సర్టిఫికెట్

గురువు/సంస్థ సంతకం చేసిన ధ్రువపత్రం

విజువల్ ఆర్ట్స్ అభ్యర్థులు తమ కళాకృతుల ఫొటోలు సమర్పించాలి.

దరఖాస్తు విధానం:

ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, పత్రాలను ది డైరెక్టర్‌ సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ (సీసీఆర్‌టీ), 15 ఏ, సెక్టార్‌-7, ద్వారక, న్యూదిల్లీ చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: 31.07.2026.

Website: https://ccrtindia.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram