ఎంటీపీఎఫ్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఎంటీపీఎఫ్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్‌ఎల్‌)కు చెందిన మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ (ఎంటీపీఎఫ్‌), అంబర్‌నాథ్‌లో నాన్-ఐటీఐ, ఎక్స్-ఐటీఐ అప్రెంటిస్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టులు: 162

వివరాలు:

  1. నాన్-ఐటీఐ అప్రెంటిస్ - 83

  2. ఎక్స్-ఐటీఐ అప్రెంటిస్ - 79

విభాగాలు: ఫిట్టర్. టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం తదితర విభాగాలు.

అర్హత: నాన్‌-ఐటీఐ, ఎక్స్‌-ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో అర్హత కలిగి ఉండాలి.

స్టైపెండ్: నాన్-ఐటీఐ అప్రెంటిస్‌లకు మొదటి సంవత్సరం నెలకు రూ.12,600, రెండో సంవత్సరం నెలకు రూ.14,400. ఎక్స్-ఐటీఐ అప్రెంటిస్‌లకు రెండేళ్ల ట్రేడ్లలో నెలకు రూ.16,200, ఏడాది ట్రేడ్లలో నెలకు రూ.14,400 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: అప్రెంటిస్ యాక్ట్, 1961, అమెండ్‌మెంట్ యాక్ట్, 1973 నిబంధనల ప్రకారం అప్రెంటిస్‌ల నియామకం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: చీఫ్ జనరల్ మేనేజర్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్‌నాథ్, జిల్లా - థానే, మహారాష్ట్ర, పిన్ కోడ్ - 421502.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 9

Website: https://www.avnl.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram