బీఈఎంఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

బీఈఎంఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్‌), బెంగళూరు కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 1346

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్)

  2. డిప్లొమా అప్రెంటిస్ ట్రేడ్ (ఐటీఐ)

  3. ట్రేడ్ అప్రెంటిస్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఐటీఐ/డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎలక్ట్రీషియన్. వెల్డర్, మెషినిస్ట్, మోటార్ వెహికిల్ మెకానిక్

వయోపరిమితి: కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి.

వేతనం: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12,300. డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.10,900. ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ.9,600 - రూ.10,560.

ఎంపిక ప్రక్రియ: మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 8

Website: https://recruitment.bemlindia.in/Apprentice/VacancyNotice.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram