హాల్‌, నాసిక్‌లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులు

హాల్‌, నాసిక్‌లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌), నాసిక్‌ ఆధ్వర్యంలోని ట్రైనింగ్‌ అండ్ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా, నాన్‌-టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లు, ఐటీఐ ట్రేడ్స్‌ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 627

వివరాలు:

విభాగాల వారీగా ఖాళీలు

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 133 ఖాళీలు

  1. ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ - 8

  2. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ఐటీ - 8

  3. సివిల్‌ ఇంజినీరింగ్‌ - 12

  4. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ - 18

  5. ఈ&టీసీ/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌- 18

  6. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ - 55

  7. కెమికల్‌ ఇంజినీరింగ్‌ - 2

  8. ఏఐ & డీఎస్‌/ఏఐ & ఎంఎల్‌-8

  9. ఫార్మసిస్ట్‌ - 4

డిప్లొమా అప్రెంటిస్‌: 61 ఖాళీలు

  1. ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌ - 2

  2. సివిల్‌ - 5

  3. కంప్యూటర్‌/ఐటీ - 4

  4. ఎలక్ట్రికల్‌ -10

  5. ఈ&టీసీ/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌- 10

  6. మెకానికల్‌ - 25

  7. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ - 5

నాన్‌-టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 78 ఖాళీలు

ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 355 ఖాళీలు

శిక్షణ వ్యవధి: ఏడాది.

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్, సివిల్‌,

ఇన్‌స్ట్రుమెంటేషన్‌, బీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌, బీబీఏ, ఫిట్టర్‌, టూల్‌ అండ్‌ డై మేకర్‌, టర్నర్‌,

మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌, షీట్‌ మెటల్‌ వర్కర్‌, వెల్డర్‌, పెయింటర్‌ తదితరాలు.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగం/ట్రేడుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, ఇంజినీరింగ్‌(బీఈ/బీటెక్‌), బీఫార్మ్‌, డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే శిక్షణ పొందిన అభ్యర్థులు అర్హులు కాదు. అభ్యర్థులు ఎన్‌ఏటీ (NATS 2.0) పోర్టల్‌లో నమోదు చేసుకుని, రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొంది ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు ఇఇంజినీరింగ్‌/నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు రూ.12,930; డిప్లొమా (టెక్నీషియన్‌) అప్రెంటిస్‌కు రూ.10,900; ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.11,040(రెండేళ్ల అప్రెంటిస్‌కు) రూ.10,560(ఏడాది అప్రెంటిస్‌కు).

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ముందుగా అభ్యర్థులు ఎన్‌ఏటీ 2.0 పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుని స్టూడెంట్‌ ఐడీ/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ పొందాలి. అనంతరం నోటిఫికేషన్‌లో ఇచ్చిన అధికారిక దరఖాస్తు లింక్‌/క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫారం పూర్తి చేయాలి.

దరఖాస్తు చివరి తేదీ: 04.09.2026

ఫిజికల్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌: సెప్టెంబర్‌ 2వ-3వ వారంలో

షార్ట్‌లిస్ట్‌ జాబితా: సెప్టెంబర్‌ 4వ వారం.

అప్రెంటిస్‌షిప్‌ ప్రారంభం: అక్టోబర్‌ 1వ, 2వ వారం

Website: https://hal-india.co.in/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram