కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు

కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్‌) అప్రెంటిస్ యాక్ట్, 1961/1973 ప్రకారం వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 134

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ

  2. టెక్నీషియన్/జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్ ట్రెయినీ

విభాగాలు: బీఈ/బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లు.

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ స్ట్రీమ్ పోస్టులకు బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, బిజినెస్ స్టడీస్ వంటి డిగ్రీలు ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12,300, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌లకు రూ.10,900.

ఎంపిక ప్రక్రియ: అన్ని సంవత్సరాలు/సెమిస్టర్లలో సాధించిన మార్కులను కలిపి మొత్తం శాతం ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. సమాన మార్కులు వచ్చినప్పుడు ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం. శిక్షణ పూర్తయిన తర్వాత కొంకణ్ రైల్వేలో ఉద్యోగం కల్పించడం తప్పనిసరి కాదు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు

  • బీఈ సివిల్, డిప్లొమా సివిల్, బీఈ ఎలక్ట్రానిక్స్ – 2026 ఆగస్టు 24

  • బీఈ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ – 2026 ఆగస్టు 25

  • బీఈ మెకానికల్, డిప్లొమా మెకానికల్ – 2026 ఆగస్టు 27

  • జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లు – 2026 ఆగస్టు 28.

వేదిక: ఎగ్జిక్యూటివ్స్ క్లబ్, కొంకణ్ రైల్ విహార్, సెక్టార్-40, సీవుడ్స్ రైల్వే స్టేషన్ (వెస్ట్) ఎదురుగా, నవీ ముంబయి 400706.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

చివరి తేదీ: 24.8.2026

Website: http://www.konkanrailway.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram