సెంట్రల్ పవర్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు 

సెంట్రల్ పవర్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు 

భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్‌ఐ), దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టులు: 110

వివరాలు: 

ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1 - 08
సైంటిఫిక్ అసిస్టెంట్- 02
ఇంజినీరింగ్ అసిస్టెంట్- 11
టెక్నీషియన్ గ్రేడ్ 1- 09
టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ 1- 37
అసిస్టెంట్ గ్రేడ్ II - 29
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ గ్రేడ్ 1- 14

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంబంధిత విభాగంలో టెన్త్‌/డిప్లొమా/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/సివిల్/ఎంకాం/బీఏ/బీకాం/ఎంబీఏ/ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 25 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.65,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 12-10-2026

Website: https://cpri.res.in/en/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram