నిర్మల్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని భైంసా, ఖానాపూర్, ముదోల్, నిర్మల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా మొత్తం 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుండగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
వివరాలు:
నిర్మల్‌లోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో గల ఖాళీల సంఖ్య: 89
అర్హతలు: అభ్యర్థుల తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
అంగన్‌వాడీ హెల్పర్ (Anganwadi Helper) పోస్టుకు సంబంధించి, ఇంటర్మీడియట్ / 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరూ అందుబాటులో లేనట్లయితే, తదుపరి పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
వయోపరిమితి: ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానకత కలిగిన మహిళా అభ్యర్థులు, దివ్యాంగులు వినికిడి పరికారాలు వినియోగించి వినగలిగే, అంధత్వం గల ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించే సామర్థ్యం, అంగవైకల్యంగల ప్రాథమిక విద్యాబోధన, పిల్లలను సంరక్షించగల మహిళా అభ్యర్థులు అర్హులు.
ఎంపిక విధానం: అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత వార్డులోనూ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలోనూ నివసిస్తూ ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక వార్డు స్థానికులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)..అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించింది.
ఎంపికలో మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలకు పది మార్కులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2026.
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవలసిన ధ్రువపత్రాలు:
పుట్టిన తేదీ/వయసు ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
విద్యార్హత ధ్రువీకరణ పత్రం (ఇంటర్/ఆపై విద్యార్హత మార్కుల జాబితా)
నివాస ధ్రువీకరణ పత్రం
అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికేట్
వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
ఆనధ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం.
Website:https://mis.tgwdcw.in/
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్‌వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్‌వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం