భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు :

  • సీనియర్ ఇంజినీర్ : 12

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ (డేటాబేస్ & సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్), ఎలక్ట్రానిక్స్ (ఎంబెడ్డెడ్ సిస్టమ్ డెవలప్‌మెంట్) కంప్యూటర్ సైన్స్ (3డీ విజువల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్) తదితర విభాగాలు..

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ (4 సంవత్సరాల కోర్సు) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో కనీసం 4 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి. (జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉండాలి).

గరిష్ఠ వయోపరిమితి: 01.08.2026 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (85 మార్కులు), ఇంటర్వ్యూ (15 మార్కులు) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 29.

Website: https://bel-india.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram