కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2026

కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2026

కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (సీహెచ్‌ఎస్‌ఎల్‌)-2026' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 2536

వివరాలు:

  1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్

  2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో)

  3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. డీఈఓ/డీఈఓ గ్రేడ్ 'ఏ' పోస్టుల కోసం, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 01-10-2026 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1999 నుంచి ఆగస్టు 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

జీతభత్యాలు:

  • ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎకు రూ.29,200-92,300.

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ప్రశ్నపత్రం: టైర్‌-1 పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (25 ప్రశ్నలు, 50 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌(25 ప్రశ్నలు, 50 మార్కులు), క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ (25 ప్రశ్నలు, 50 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌ (25 ప్రశ్నలు, 50 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. టైర్‌-2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు. ఇందులో మ్యాథమేటికల్‌ ఎబిలిటీస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ మాడ్యుల్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 07.09.2026

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 07.10.2026

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08.10.2026

దరఖాస్తు సవరణ తేదీలు: 14.10.2026 నుంచి 16.10.2026 వరకు.

Website: https://ssc.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram