ఎంఆర్‌పీఎల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు

ఎంఆర్‌పీఎల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు

ఓఎన్‌జీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌), గేట్‌ 2026 స్కోర్ల ద్వారా మేనేజ్‌మెంట్ కేడర్‌లోని 'ఈ2' గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • అసిస్టెంట్ ఇంజనీర్- 27

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ తదితరాలు..

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈ) పేపర్‌లో చెల్లుబాటు అయ్యే గేట్‌ 2026 మార్కులు కలిగి ఉండాలి.

జీతం: నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000.

వయోపరిమితి: గరిష్ఠంగా 27 ఏళ్ల వరకు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ. 118. (రూ. 100 + 18% GST). ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 19/09/2026.

Website: https://www.mrpl.co.in/hi/careers?prophazecheck=2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram