యూపీఎస్సీ- ఈపీఎఫ్‌ఓ గ్రూప్‌-ఏ పోస్టులు

యూపీఎస్సీ- ఈపీఎఫ్‌ఓ గ్రూప్‌-ఏ పోస్టులు

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)లో గ్రూప్-'ఏ' అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఏపీఎఫ్‌సీ) పోస్టుల భర్తీకి యూపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రకటనను విడుదల చేసింది.

వివరాలు:

  • అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఏపీఎఫ్‌సీ): 80 పోస్టులు (యూఆర్‌-29, ఈడబ్ల్యూఎస్‌-08, ఓబీసీ-18, ఎస్సీ-15, ఎస్టీ-10; దివ్యాంగులకు (PwBD)- 03)

అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంపెనీ లా, లేబర్ లాస్, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌లకు గరిష్టంగా 35 సంవత్సరాలు ఓబీసీలకు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 40 సంవత్సరాలు, దివ్యాంగులు (PwBD): 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది: పెన్ & పేపర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (RT), ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.25, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 11.09.2026

పరీక్ష తేదీ: 20.12.2026.

Website: https://www.upsc.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram