ఇస్రో-లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇస్రో-లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌లో ఉద్యోగాలు

తిరువనంతపురంలోని ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 19

వివరాలు:

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌, కెమికల్‌): 07

  • టెక్నీషియన్‌-బి(ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌): 01

  • టెక్నీషియన్‌-బి(ఫిట్టర్‌): 09

  • డ్రాట్స్‌మ్యాన్‌-బి (మెకానికల్‌): 01

  • ఫైర్‌మ్యాన్‌-ఏ: 01

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీతో పాటు ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.44,900- రూ.1,42,400; టెక్నీషియన్‌-బికు రూ.21,700- రూ.69,100; డ్రాట్స్‌మ్యాన్‌కు రూ.21,700 - రూ.69,100; ఫైర్‌మ్యాన్‌కు రూ.19,900 - రూ.63,200.

వయోపరిమితి: 04.09.2026 నాటికి టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, డ్రాట్స్‌మ్యాన్‌ పోస్టులకు 35 ఏళ్లు, ఫైర్‌మ్యాన్‌కు 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 04.09.2026

Website: https://www.isro.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram