ఐఓసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఐఓసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) సివిల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులైన గ్రాడ్యుయేట్ ఇంజినీర్, ఆఫీసర్ (మార్కెటింగ్), లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లొమా ఇంజినీర్ పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 470

వివరాలు:

  • గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌, ఆఫీసర్‌ (గ్రేడ్‌-ఏ): 411

  • అసిస్టెంట్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-ఏ0): 09

  • డిప్లొమా ఇంజినీర్‌ (గ్రేడ్‌ ఈ0): 50

విభాగాలు: సివిల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ, క్వాలిటీ కంట్రోల్‌, సేఫ్టీ, మార్కెటింగ్‌, లా.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంబీఏ/పీజీ డిప్లొమా, ఎల్‌ఎల్‌బీ, పీజీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2026 నాటికి జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌,డిప్లొమా ఇంజినీర్‌కు 26 ఏళ్లు; ఆఫీసర్‌ పోస్టులకు 28 ఏళ్లు, లా ఆఫీసర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

బేసిక్‌ పే: గ్రేడ్‌ ఏ పోస్టులకు రూ.50,000; గ్రేడ్‌-ఏ0 పోస్టులకు రూ.40,000; గ్రేడ్‌-ఈ0కు రూ.30,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 03.09.2026

సీబీటీ: 24.09.2026

Website: https://ibpsreg.ibps.in/iocljun26/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram