ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు

ఎస్‌బీఐలో  జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్లర్కు కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 9124

  • రెగ్యులర్‌ పోస్టులు: 7680, బ్యాక్‌లాగ్‌ పోస్టులు: 1444

వివరాలు:

  • జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 31-12-2026 నాటికి డిగ్రీ పూర్తి కావాలి. ఫైనల్ ఇయర్/సెమిస్టర్ విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు; అయితే ఎంపికైతే 31-12-2026లోపు డిగ్రీ ఉత్తీర్ణతకు సంబంధించిన ఆధారం సమర్పించాలి.

వయోపరిమితి: 01-04-2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. అంటే 02-04-1998 నుంచి 01-04-2006 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌సర్విస్‌మెన్‌ తదితర కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.

పే స్కేల్‌: రూ.24,050 - రూ.64,480. ముంబయి వంటి మెట్రో నగరాల్లో డీఏ, ఇతర అలవెన్సులతో కలిపి ప్రారంభ మొత్తం వేతనం సుమారు నెలకు రూ.46,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, లోకల్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులు, 60 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు. మెయిన్ పరీక్ష 200 మార్కులు, 2 గంటల 40 నిమిషాలు
జనరల్‌/ఫైనాన్స్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు, జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

లోకల్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (LLPT)- దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో నిర్వహిస్తారు. 10వ/12వ తరగతిలో సంబంధిత స్థానిక భాష చదివినట్లు సర్టిఫికెట్ ఉంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్విస్‌మెన్‌లకు ఫీజు లేదు.

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11-08-2026

ఆన్‌లైన్ దరఖాస్తు/ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 31-08-2026

ప్రిలిమినరీ పరీక్ష: సెప్టెంబర్ 2026లో తాత్కాలికంగా

మెయిన్ పరీక్ష: నవంబర్ 2026లో తాత్కాలికంగా

Website: https://ibpsreg.ibps.in/sbijajul26/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram